NTV Telugu Site icon

YSRCP MLAs Black Scarves: నల్ల కండువాలతో అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు.. పోలీసులపై జగన్ ఫైర్..!

Ysrcp

Ysrcp

YSRCP MLAs Black Scarves: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ప్రారంభమైంది. తొలి రోజే అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో అసెంబ్లీకి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వెళ్లారు. జగన్ నేతృత్వంలో ‘‘సేవ్‌ డెమోక్రసీ’’ నినాదాలు చేస్తూ ముందుకు కొనసాగారు. అయితే.. వైసీపీ సభ్యుల్ని అసెంబ్లీ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. ఫ్లకార్డులు ప్రదర్శించొద్దంటూ గొడవకు దిగారు. ఈ క్రమంలో ప్లకార్డుల్ని లాగేసి పోలీసులు చించేశారు. దీంతో వైఎస్‌ జగన్ పోలీసుల తీరుపై మండిపడ్డారు.

Read Also: Dhanush : నా ఫేవరెట్ హీరో ఆయనే..మల్టీస్టారర్ ఆ హీరోతో మాత్రమే చేస్తా..!

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. పోలీసులు వైఖరి అత్యంత దారుణంగా మారిపోయిందన్నారు. పోస్టర్లు గుంజుకుని చింపివేసే హక్కు ఎవరిచ్చారు? అని నిలదీశారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు దగ్గర కాసేపు పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. జగన్‌ నిలదీత, ఈలోపు అసెంబ్లీ ప్రారంభం అవుతుండడంతో నల్ల కండువాలతోనే వైసీపీ ఎమ్మెల్యేలను పోలీసులు లోపలికి పర్మిషన్ ఇచ్చారు.

Show comments