ఆంధ్రప్రదేశ్‌లో అచ్చెన్నాయుడు, ఆర్కే రోజా మధ్య సవాళ్ల పర్వం హాట్ టాపిక్‌గా మారిపోయింది… ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు వస్తాయంటూ అచ్చెన్నాయుడు పెద్ద జోక్ చేశారని ఎద్దేవా చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. తిరుపతి ఎంపీ ఎన్నికల సమయంలో ‘పార్టీ లేదు.. తొక్కా లేదు’ అన్న వ్యక్తి ఇప్పుడు 160 సీట్లంటూ జోక్ చేస్తున్నారని.. నువ్వు గానీ చంద్రబాబు నాయుడు గానీ తలకిందులుగా తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా.. ఇప్పుడున్న 23 సీట్లు రావడం కూడా కష్టం.. నీకు సరదాగా ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకు రా.. అంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. అయితే, అచ్చెన్నాయుడు కూడా అదే స్థాయిలో స్పందించారు.. రోజాకు ధైర్యముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.. నగరిలో టీడీపీ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో మేం పోటీ చేయబోమని ప్రకటించారు అచ్చెన్నాయుడు..
Read Also: KCR: రేపు సంచలన ప్రకటన.. టీవీలు చూడండి-కేసీఆర్
ఇక, అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మరోసారి మరింత ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అచ్చెన్నాయుడుకు తిన్నది అరగకుంటే రాజీనామా చేసి గెలవమనండి అంటూ మరో సవాల్ విసిరారు.. నేను గెలిస్తే వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కాదు.. వాళ్లు 23 మంది రాజీనామా చేసి పోటీ చేసి మళ్లీ గెలిస్తే నేనే పోటీ చేయను అంటూ సంచలన ప్రకటన చేశారు రోజా.. ఇక, నన్ను టీడీపీలో వున్నప్పుడు చంద్రగిరి, నగరి అని ఫుడ్ బాల్ ఆడి ఓడించారని మండిపడ్డ ఆమె.. కులం పేరు చెప్పి టీడీపీ వాళ్లే నన్ను ఓడించారని… కానీ, జగన్న రెండు సార్లు నన్ను గెలిపించారని తెలిపారు.. అయితే, చంద్రబాబు, లోకేష్ బాబులు తలక్రిందులు తపసుస్సు చేసినా టీడీపీ 160 సీట్లు గెలవలేదని స్పష్టం చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.