Kodali Nani Drives RTC Bus: ఆర్టీసీ బస్సును నడిపిన కొడాలి నాని.. వైరల్‌గా మారిన వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani Drives RTC Bus: నేతలు ఏదైనా చేస్తే.. అది వైరల్‌గా మారిపోతోంది.. ఎన్నికల ప్రచార పర్వంలోనే కాదు.. కొత్త పథకాలను ప్రారంభించినప్పుడు.. ఇంకా ఏదైనా కొత్తగా ఓపెన్ చేసినప్పుడు.. తమలోని స్కిల్‌ను బయటపెట్టేస్తుంటారు.. తాజా, మాజీ మంత్రి, గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ప్రతీరోజూ ప్రతిపక్షాలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడే కొడాలి నాని.. ఒక్కసారిగా ఆర్టీసీ డ్రైవర్ అవతారం ఎత్తేశారు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లాంటి నేతలపై పవర్ పంచ్‌లు విసిరే కొడాలి.. స్టీరింగ్ పట్టారు.. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది..
Read Also: Gold and Silver Price: పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. మరింత పడిపోయిన బంగారం ధర
Also Read
ఇంతకీ, కొడాలి నాని ఆర్టీసీ బస్సును ఎందుకు నడపాల్సి వచ్చింది అనే వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో కొత్తగా ఐదు హైర్ బస్సులను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. అంతేకాదండోయ్ ఇదే సమయంలో తనలో ఉన్న డ్రైవింగ్ స్కిల్‌ను ప్రదర్శించారు.. నూతనంగా ప్రారంభించిన బస్సును పట్టణ ప్రధాన రహదారుల్లో స్వయంగా నడిపారు.. అయితే, ఆ దృశ్యాలను కెమెరాలో సంబంధించి సోషల్ మీడియాలో వదలడంతో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. ఇక, గుడివాడ నుండి బంటుమిల్లి, కైకలూరు మధ్య నూతన సర్వీసులను ప్రారంభించి కొడాలి నాని.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళిత సోదరులు ఏర్పాటు చేస్తున్న బస్సులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.. దళిత వర్గాల శ్రేయస్సుకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!