NTV Telugu Site icon

Anam Ramanarayana Reddy: మేం సిగ్గు పడుతున్నాం.. మీకు ఉందో లేదో తెలియదు..!

Anam Ramanarayana Reddy

Anam Ramanarayana Reddy

మేం సిగ్గు పడుతున్నాం.. అధికారులుగా మీకు ఉందో లేదో నాకు తెలియదు అంటూ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి.. నెల్లూరు జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన.. నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ప్రారంభిస్తామని అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాటలను అధికారులు బేఖాతరు చేస్తున్నారని.. తప్పుడు సమాచారం ఇచ్చి.. ముఖ్యమంత్రి చేత తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ అధికారులు వాస్తవాలు సీఎంవో కి ఇవ్వాలని సూచించారు. ఇక, మూడేళ్లుగా 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేక పోతున్నారు.. పరువు పోతోంది అని ఫైర్‌ అయ్యారు ఆనం రాంనారాయణరెడ్డి… బ్యారేజీల శిలాఫలకాలు, మా పేర్ల కోసం కాదు.. ప్రజలకు మేలు జరగాలన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులపై మంత్రి గోవర్ధన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలన్నారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయం చేయదలచుకోలేదు