Site icon NTV Telugu

JanaSena: ఈ నెల 26న జనసేనలోకి భారీగా చేరికలు..

Janasena

Janasena

JanaSena: ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. ఈ నెల 26వ తేదీన మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో వీరు పార్టీలో చేరుతారు అని వెల్లడించారు. ఇప్పటికే వీరు ముగ్గురూ వేర్వేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశం అయిన తర్వాత పార్టీలో చేరికపై చర్చించారు.

Read Also: Janhvi Kapoor: కరణ్ చిత్రంలో ప్రత్యేక అతిధి పాత్రలో దేవర స్టార్ జాన్వీ కపూర్

ఇక, అదే రోజు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ యూత్ జోనల్ ఇంఛార్జుగా ఉన్న అవనపు విక్రమ్, విజయనగరం, పార్వతీపురం జిల్లాల డీసీఎంఎస్ చైర్ పర్సన్ గా ఉన్న డాక్టర్ అవనపు భావన కూడా అధినేత పవన్ సమక్షంలో జనసేనలో చేరతారు అని జనసేన అధ్యక్షులకు రాజకీయకార్యదర్శి ప్రకటించారు. అలాగే, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లాకు చెందిన డా.యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జడ్పీటీసీ డా. యాదాల రత్న భారతి పవన్ పార్టీలో చేరనున్నారు. ఇక, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగర పాలక సంస్థల నుంచి పలువురు కార్పొరేటర్లు కూడా జనసేన కండువా వేసుకోనున్నారు. కాగా, ఈరోజు (శనివారం) మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యతో పాటు కంది రవిశంకర్ సమావేశమయ్యారు. ఆ తర్వాత సామినేని ఉదయభాను భేటీ అయ్యారు.

Whatsapp Image 2024 09 21 At 4.21.41 Pm

Exit mobile version