ఏపీలో హాట్ పాలిటిక్స్ కి కృష్ణా జిల్లా కేరాఫ్ అడ్రస్. అక్కడ ఏం జరిగినా రాజకీయంగా సంచలనమే. తాజాగా పామర్రు గ్రామ పంచాయతీలో ఓ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ప్రజలకు అసౌకర్యం కల్పించే పందులను నియంత్రించేందుకు పనిచేస్తున్న సిబ్బందికి.. అదే గ్రామానికి చెందిన వైసీపీ నేతకు మధ్య గొడవ జరిగింది.
పందుల వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని జనం గ్రామపంచాయితీకి కంప్లైంట్ చేశారు.ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించే పందుల నియంత్రణకు పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. అయితే పందుల పెంపకం దారులు, అధికార పార్టీ నేత వచ్చి అడ్డుపడటంతో పందుల్ని పట్టుకున్నా వాటిని విడిపించుకుపోయారు. ఈ ఘటనపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు ప్రజల కోసం పనిచేయాలంటున్నారు గ్రామస్తులు. అయితే ఈ వ్యవహారం అంతా ఎమ్మెల్యే కార్యాలయంలోని నేతల కనుసన్నల్లోనే జరిగింది.