ఆంధ్రప్రదేశ్‌ను విద్యలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టేందుకు చిత్త శుద్ధితో కృషి చేస్తున్నాం.. ఐదు, పదేళ్లలో హైలీ ఎడ్యుకేటెడ్ రాష్ట్రంగా ఏపీ ఉంటుందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ కార్యాలయంలో జరిగిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకల్లో.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందన్నారు.. ఎవరిపై ఎలాంటి ఒత్తిడి చేయటం లేదన్న ఆయన.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన విద్యా సంస్థల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
Read Also: చిత్తూరు, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
ప్రజలందరూ అవగాహన చేసుకోవాలి.. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో సంస్కరణలకు ప్రయత్నం చేస్తుంటే టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.. పేదవాళ్లు చదువుకోవడం ఎలా అని లోకేష్ అడుగుతున్నాడు..? పేద వర్గాలకు రూపాయి ఖర్చు లేకుండా పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.. లోకేష్ కు అవగాహన ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. విష ప్రచారం చేస్తే ప్రజలు సహించరు అని హెచ్చరించారు.. ఘోరాలు అన్నీ చంద్రబాబు హయాంలో జరిగాయని ఆరోపించారు సజ్జల.. మంచి పరిణామాల దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారన్న ఆయన.. ఐదు, పదేళ్లలో హైలీ ఎడ్యుకేటెడ్ రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుందని.. ఆ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని స్పష్టం చేశారు.