Site icon NTV Telugu

Atmakur Bypoll : వైసీపీ అభ్యర్థిగా విక్రమ్ రెడ్డి నామినేషన్

Vikramreddy

Vikramreddy

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డిని ఎంపిక చేశారు సీఎం జగన్.

బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్‌తో విక్రమ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ భేటీకి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు.సీఎం జగన్‌ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి ఇవాళ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

మరోవైపు ఆత్మకూరు బరిలో నిలవాలని బీజేపీ నిర్ణయించింది. ఆత్మకూరు ఉప ఎన్నికపై మాకు పూర్తి అవగాహన ఉందన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. జనసేనతో చర్చించిన తర్వాతే పోటీకి సిద్ధం అయ్యామన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నిక అభ్యర్ధి ఎంపికపై బీజేపీ తుది కసరత్తు చేస్తోంది. రవీంద్రారెడ్డి పేరును పరిశీలిస్తోంది పార్టీ అధినాయకత్వం. ఒకటి రెండు రోజుల్లో ఆత్మకూరు ఉప ఎన్నిక అభ్యర్థిపై అధికార ప్రకటన చేయనుంది బీజేపీ. కాంగ్రెస్ కూడా అభ్యర్ధి వేటలో వుంది. టీడీపీ తన పాత సంప్రదాయాన్ని కొనసాగించనుంది. ఆత్మకూరులో ఏకగ్రీవం అనేది జరగకపోవచ్చు. పోటీ అనివార్యం కావడంతో వైసీపీ అభ్యర్ధి విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించేందుకు వైసీపీ మంత్రులు, నేతలు పనిచేస్తున్నారు.

Atmakuru By Poll: ఆత్మకూరు ఏకగ్రీవమా? పోటీ అనివార్యమా?

Exit mobile version