Site icon NTV Telugu

YSRCP MLC Candidates: నేడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

Ap Cm Jagan

Ap Cm Jagan

ఏపీలో శాసనమండలి ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నెలకొంది. శాసనమండలికి పోటీచేసే వైసీపీ అభ్యర్థుల ప్రకటన ఇవాళ విడుదల అవుతుందని భావిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత జగన్ భావించారు. అందులో భాగంగానే కసరత్తు పూర్తి చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పెద్ద పీట వేయనున్నారు. శాసనమండలి ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో అభ్యర్థుల ఎంపిక సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం సూచించినట్లుగా బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రముఖ స్థానం ఉంటుందని భావిస్తున్నారు.

Read Also: Stalled Wedding: కొన్ని నిమిషాల్లో పెళ్లి.. నో చెప్పిన వరుడు.. అసలేం జరిగింది?

స్థానిక సంస్థల్లో నెల్లూరు నుంచి మేరుగ మురళీధర్ (గూడూరు), కడప నుంచి పి. రామ సుబ్బారెడ్డి (మాజీ మంత్రి జమ్మల మడుగు), తూర్పుగోదావరి జిల్లా నుంచి కుడిపూడి సూర్యనారాయణ (అమలాపురం) జయ మంగళం వెంకటరమణ (మాజీ ఎమ్మెల్యే కైకలూరు), అనంతపురం నుంచి మాజీ ఎంపీ హిందూపురం గంగాధర్ లేదా ఆయన సతీమణి, లేదా నవీన్ నిచ్చల్, రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, పశ్చిమగోదావరి జిల్లాలో వంకా రవీంద్ర లేదా జి . నాగబాబు శ్రీకాకుళంలో నీలకంఠ నాయుడు లేదా నర్త రామారావు ఎమ్మెల్యేల, గవర్నర్ కోటాలో డొక్కా మాణిక్య వరప్రసాద్ (రెన్యువల్) మర్రి రాజశేఖర్, పోతుల సునీత (రెన్యువల్) శ్రీకాళహస్తి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, చల్లా శ్రీలక్ష్మి, ప్రకాశం జిల్లా నుంచి జంకె వెంకటరెడ్డి, రావి రామనాథం బాబు, ముస్లింలలో గుంటూరు నుంచి జియా ఉద్దీన్, విజయవాడ లో బొప్పన భువన కుమార్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం అధికారికంగా అభ్యర్థుల జాబితా ప్రకటన విడుదల అయ్యే ఉందని తెలుస్తోంది. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ లను ప్రకటించనున్నారు. 16 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుంది.

Read Also: Congress Plenary Session: కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలకు భారీ ఏర్పాట్లు.. బీజేపీని ఓడించడమే లక్ష్యం

Exit mobile version