YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటిలో గతంలో వాచ్‌మెన్‌గా పనిచేసిన రంగన్న అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కుటుంబ సభ్యులు చికిత్స కోసం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగన్న పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కి తరలించారు. చికిత్స పొందుతూ రంగన్న మృతి చెందారు.. అయితే, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రంగన్న ప్రధాన సాక్షిగా ఉన్నారు. వివేకను హత్య చేసిన హంతకులను రంగన్న గుర్తించడంతో సీబీఐ విచారణ మొదలైంది. ఆ నలుగురే వివేకాను హత్య చేశారని గతంలో రంగన్న సీబీఐకి స్టేట్‌మెంట్ ఇచ్చారు.
Read Also: AP Government: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక, ఆ బాధ్యతలు తహసీల్దార్లకు అప్పగింత..
ఇక, మృతుడు రంగన్న భార్య సుశీలమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు.. నా భర్త రంగన్న అనారోగ్య సమస్యతో బాధపడేవారన్నారు.. గత ప్రభుత్వంలో మమ్మల్ని బాగా చూసుకున్నారు.. గత ప్రభుత్వంలో 3000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చేవారని తెలిపారు.. అయితే, గత మూడు నెలల నుంచి నా భర్త చాలా మానసికంగా దెబ్బతిన్నాడు.. నా భర్త ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారని వెల్లడింఆచరు.. నీవు వచ్చేలోపు నేను బ్రతుకుతానో లేదో అని నాతో అన్నాడని గుర్తుచేసుకున్నారు.. నా భర్తకు బాగాలేదని మా ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసులు నాకు ఫోన్ చేసి చెప్పారని.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.. ఇక, నా భర్త ఊపిరితిత్తుల వ్యాధితోనే మృతి చెందాడని తెలిపారు వాచ్‌మెన్ రంగన్న భార్య సుశీలమ్మ..