NTV Telugu Site icon

Kadapa: కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం.. ఇద్దరు మృతి

Frinking New Year

Frinking New Year

ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరం వేడుక జోష్ లో యువత మునిగిపోయింది. కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం గండికోటకు వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్కార్పియో బోల్తా పడింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వాహనంలో మొత్తం 7 మంది ఉన్నట్లు సమాచారం.. జమ్మలమడుగు మండలం చిటిమిటి చింతల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

Read Also: KC Venugopal: కేరళ మినీ పాక్ అన్న మహారాష్ట్ర మంత్రిపై మోడీ చర్యలు తీసుకోవాలి

సింహాద్రిపురం మండలానికి చెందిన ఏడుగురు యువకులు న్యూ ఇయర్ వేడుకలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చిటిమిటి చింతల సమీపంలో కారు కల్వర్ట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరో నలుగురిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also: Syria-France: సిరియాలోని ఐసిస్ స్థావరాలపై ఫ్రాన్స్ దాడులు.. ఇద్దరు మృతి

Show comments