Site icon NTV Telugu

Palla Srinivasa Rao: కనివిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహిస్తాం..

Palla

Palla

Palla Srinivasa Rao: కడప నగరంలోని పబ్బాపురం దగ్గర నిర్వహించనున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) మహానాడు ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కనివిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించాం అన్నారు. మహానాడు నిర్వహణపై కమిటీలు వేశాం.. మహానాడు నిర్వహణలో 13 కమిటీలు కీలకంగా వ్యవహరించబోతున్నాయి.. ఆ 13 కమిటీల సలహాలు, సూచనలను క్రోడీకరించి ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ అనే విధంగా మహానాడు కార్యక్రమం నిర్వహించబోతున్నాం అని పల్లా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

Read Also: Tollywood : ఎగ్జిబిటర్ల నిరసన.. జూన్ సినిమాల పరిస్థితి ఏంటి..?

ఇక, కడపలో అకామీడేషన్ సమస్య ఉందని అందరూ అనుకున్నారు అని రాష్ట్ర టీడీపీ అధినేత పల్లా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. కానీ, ఎప్పుడు ఇంత పెద్ద ప్రాంగణంలో మేము మీటింగ్ నిర్వహించలేదు.. మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ నిర్వహిస్తాము.. 23,000 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపంచాం.. మూడవ రోజు ఐదు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించబోతున్నాం.. రాయలసీమ సెంట్రిక్ గా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో వాటిపై ప్రధానంగా చర్చిస్తాం.. టీడీపీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం కలిగించిన పార్టీ.. తెలంగాణలో కూడా టీడీపీ మూలలు ఉన్నాయని పల్లా శ్రీనివాసరావు అన్నారు.

Exit mobile version