Site icon NTV Telugu

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో సాక్షి మృతి.. కడప ఎస్పీ సంచలన వ్యాఖ్యలు

Kadapa Sp

Kadapa Sp

YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న నలుగురు వ్యక్తులు అనారోగ్యంతో మృతి చెందడంపై అనుమానం వ్యక్తం చేశారు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. కీలక సాక్షిగా ఉన్న రంగన్న నిన్న సాయంత్రం కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రంగన్న భార్య సుశీల తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేయడం.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అయితే, ఇటీవల కేసులో సాక్షిగా వైఎస్ అభిషేక్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయయని.. వీటిపై లోతుగా దర్యాప్తు చేపడతాం అంటూ ఎస్పీ అశోక్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు, వైఎస్‌ వివేకా కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఎందుకు మరణిస్తున్నారో తెలియాల్సి ఉందన్నారు ఎస్పీ అశోక్ కుమార్.

Read Also: Off The Record: కొత్త ఇంఛార్జ్‌కి ఆ కాంగ్రెస్‌ నేతపై మూకుమ్మడిగా ఫిర్యాదులు..?

వైఎస్‌ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశాం అన్నారు ఎస్పీ అశోక్‌ కుమార్.. వివేకా హత్య కేసులో ఒక్కొక్కరుగా సాక్షులు మృత్యువాత పడుతున్నారు… వివేకా హత్య కేసులో వరుసగా నలుగురు సాక్షులు చనిపోయారు… అందుకోసం రంగన్న మృతిని అనుమానస్పద కేసుగా నమోదు చేశాం… రంగన్న మృతిపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నాం… సాక్షులు మరణాల వెనుక అనుమానాలు ఉన్నాయి అన్నారు.. అసలు ఎందుకు సాక్షులు మరణిస్తున్నారో తెలియాల్సి ఉందన్నారు. సాక్షుల మృతి వెనక పోలీస్, సీబీఐ ఉన్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. వివేకా హత్య కేసులు సాక్షిగా ఉన్న ఆరుగురు మృతిపైన అనుమానాలు ఉన్నాయి… శ్రీనివాస్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, నారాయణ, శంకర్ రెడ్డి, వాచ్‌మెన్‌ రంగన్న.. ఇలా ఆరుగురు వివేకా హత్య కేసులో సాక్షులు.. రంగన్న మృతిలో హై ప్రొఫెషనల్ మర్డర్ గా అనుమానం ఉందన్నారు ఎస్పీ అశోక్ కుమార్..

Exit mobile version