NTV Telugu Site icon

YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. టీడీపీలోకి క్యూ కట్టిన కార్పొరేటర్లు..!

Kadapa

Kadapa

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయి.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లు కొందరు.. సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు.. ప్రజాప్రతినిధులు ఇలా వరుసగా ఆ పార్టీకి షాక్‌ ఇస్తూ.. కూటమి పార్టీలో చేరుతున్నారు.. ఇప్పటికే చాలా మంది టీడీపీ కండువా కప్పుకోగా.. మరికొందరు జనసేన.. ఇంకా కొందరు బీజేపీలో చేరిపోయారు.. అయితే, వైసీపీ కంచుకోటకు కూడా బీటలు పడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. కడప కార్పొరేషన్ లో పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే వైసీపీకి గుడ్‌బై చెప్పగా.. మరికొందరు కూడా రెడీ ఉన్నారని తెలుస్తోంది.. కడప మున్సిపల్ కార్పొరేషన్ లోని కార్పొరేటర్లు మెల్లగా టీడీపీ గూటికి చేరుకుంటున్నారు.

Read Also: Maruti Suzuki Grand Vitara: మార్కెట్లోకి మరో మారుతీ 7-సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?

50 డివిజన్లలో 49 వైసీపీ, ఒక్కస్థానంలో టీడీపీ దక్కించుకున్నాయి. అయితే, ప్రస్తుతం 47 స్థానాలు వైసీపీ చేతిలో ఉండగా ఇటీవల 25 డివిజన్ కార్పొరేటర్ సూర్య నారాయణ టిడిపిలో చేరారు. దీంతో టీడీపీ బలం రెండుకు చేరగా.. ఇప్పుడు దాదాపు 7 మందికి కార్పొరేటర్లు సైకిల్ ఎక్కారు. దీంతో టీడీపీ బలం తొమ్మిదికి చేరింది . అంతే కాదు.. దాదాపు 20 మంది వరకు చేరడానికి ముందుకు వచ్చినప్పటికీ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వారించినట్లు తెలుస్తోంది.. వీరిలో సగం మందిని మొదటి దశలో తీసుకుంటూ.. రెండో దశలో మిగిలిన వారిని తీసుకోవాలని భావిస్తున్నారట.. మొత్తంగా రెండో విడతలో చేరనున్న 11 మంది కార్పొరేటర్ల జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చేరినట్టుగా ప్రచారం సాగుతోంది.. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను ఏడింటిని టిడిపి కైవసం చేసుకుంది. ఎన్నికల్లో పరాభవం అనంతరం మేల్కొంటూ పార్టీ బాధ్యతలు మేనమామ చేతిలో పెట్టారు వైసీపీ అధినేత. ఆ తర్వాత వచ్చిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాలను కూటమి బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. చివరకు పులివెందుల్లోనూ వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు కొత్తగా కడప కార్పొరేషన్ కూడా ఆ పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతొందట. ఇక్కడ కార్పొరేటర్ లు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతుండడం.. ఆ పార్టీకి మరింత ఇబ్బంది కరంగా మారిందంటున్నారు నేతలు..