Site icon NTV Telugu

RK Roja: పులివెందులలో గెలుపు, ప్రజా తీర్పు ఎలా అవుతుంది..?

Roja

Roja

RK Roja: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కో రోజా ఎక్స్ వేదికగా స్పందించింది. గడిచిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 62 శాతం ఓటు శాతం సాధించింది.. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో 62 శాతం ఓట్లు సాధించిన పార్టీకి, వైఎస్ జగన్ అన్నకు అనుకూల వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో 8.95 శాతం ఓట్లు రావడం ఏమిటో? అని రోజా ప్రశ్నించింది.

Read Also: UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు షాక్.. త్వరలో ఆ సేవలు బంద్!

ఇక, సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల గాలి వీచిన సమయంలో.. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో టీడీపీ 24 శాతం ఓట్లు సాధించింది అని ఆర్కే రోజా తెలిపింది. అలాంటి పార్టీకి ఎన్నికల హామీలు అమలు చేయకుండా, పులివెందుల మెడికల్ కాలేజీని అమ్మకానికి పెట్టిన.. ప్రతికూల పరిస్థితుల్లో 88 శాతం ఓట్లు రావడం ఏమిటో? అని అడిగింది. అలాగే, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులకు వరుసగా 0, 1, 2, 3, 4 ఓట్లు రావడం అనుమానాలకు దారి తీస్తుంది అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లు, వారి కుటుంబ సభ్యులు కూడా వారికి ఓటు వేయలేదా? అని ప్రశ్నించింది. ఇంకా విచిత్రంగా, పోటీ చేసిన అభ్యర్థి తన ఓటును కూడా తాను వేసుకోలేదు.. ఈ ఫలితాన్ని మనం నమ్మాలా? అని మండిపడింది. అధికార దుర్వినియోగం, అవకతవకలతో పులివెందుల తీర్పు ప్రజా తీర్పు ఎలా అవుతుంది? అని మాజీ మంత్రి రోజా అడిగింది.

Exit mobile version