NTV Telugu Site icon

Minister Savitha: మూడు రాజధానుల పేరిట సీమకు తీరని ద్రోహం.. జగన్‌పై మంత్రి ఫైర్‌..

Minister Savitha

Minister Savitha

Minister Savitha: రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కడప జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి సవితా విమర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇంఛార్జ్‌ మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం తప్ప.. ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోవడానికి కారకులు ఎవరో ప్రజలందరికీ తెలుసునని, 42 మంది ప్రజలు కొట్టుకుపోయి చనిపోతే కనీసం వారికి న్యాయం కూడా చేయలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి సవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మంత్రి సవిత తెలిపారు. రెవెన్యూ సదస్సులో ప్రజల యొక్క సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారమయ్యేవి అధికారులు పరిష్కారం చేస్తారని, పరిష్కారం కాని సమస్యలను 45 రోజుల లోపు పరిష్కారం చేసేలా ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రానికి త్వరలోనే హైకోర్టు బెంచ్ , పరిశ్రమలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకురాబోతున్నారని మంత్రి అన్నారు.

Read Also: Syria Crisis: సిరియా సంక్షోభంపై స్పందించిన భారత్.. ఏం చెప్పిందంటే..!

మంచి ప్రభుత్వానికి నిదర్శనం రెవిన్యూ సదస్సులే అని అభివర్ణించారు మంత్రి సవిత.. మూడు రాజధానుల పేరిట సీమకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని మండిపడ్డా ఆమె.. సీమ జిల్లాలో హైకోర్టు అని గొప్పలు చెప్పి ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకే బెంచ్ ఏర్పాటుకు ముందుడగు పడినందనున్నారు.. సీమలో డ్రోన్ హబ్ ఏర్పాటు చేస్తాం.. గ్రామాల్లోని భూ సమస్యలకు రెవిన్యూ సదస్సులతో చెక్ పెడతామన్నారు.. ప్రజల నమ్మకాన్ని చూరగున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొన్నారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి వల్ల రాయలసీమకు త్వరలోనే హైకోర్టు బెంచ్, పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు మంత్ర సవిత.