AP High Court: కడప ఎమ్మెల్యేకు హైకోర్టులో షాక్..
- కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవరెడ్డికి హైకోర్టులో షాక్..
- మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానాలను రద్దు చేసే అధికార పరిధి..
- మునిసిపల్ కమిషనర్ కి లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన ఎమ్మెల్యే..
- పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: తెలుగుదేశం పార్టీకి చెందిన కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవరెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి మేయర్ సురేష్‌బాబు నేతృత్వంలో మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానాలను రద్దు చేసే అధికార పరిధి మునిసిపల్ కమిషనర్‌కు లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మాధవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానాలను రద్దు చేసే అధికార పరిధి మునిసిపల్ కమిషనర్ లేనే లేదని ధర్మాసనం విస్పష్టం చేసింది. కార్పొరేషన్ తీర్మానాలపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేసింది. కడప మునిసిపల్ కార్పొరేషన్ ఈ ఏడాది జూన్ 20న చేసిన తీర్మానాలను రద్దు చేస్తూ మునిసిపల్ కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను సమర్ధించింది. సింగిల్ ‘జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంది.
Also Read
అలాగే ప్రజా ప్రయోజనాల నిమిత్తం కార్పొరేషన్ తీర్మానాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్న సింగిల్ జడ్జి ఆదేశాల్లో సైతం జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానాలపై అభ్యంతరాలుంటే ఆ విషయాన్ని కమిషనర్ లేదా ఎవరైనా కౌన్సిలర్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సైతం సుమోటోగా స్పందించవచ్చునని స్పష్టం చేసింది. అంతే తప్ప నేరుగా కమిషనర్‌కు కార్పొరేషన్ తీర్మానాలను రద్దు చేసే అధికారం మాత్రం లేదని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!