Kadapa: కడప జిల్లా చాపాడు మండలంలోని పెద్ద చీపాడు గ్రామంలో దారుణ హత్య కలకలం రేపుతుంది. అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో భర్త తన భార్యను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం, పెద్ద చీపాడు గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి వృత్తిరీత్యా ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య సుజాతతో గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. అయితే, సుజాతకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన గోపాల్, ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె వినకపోవడంతో కోపంతో ఊగిపోయాడు.
Read Also: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే..?
దాంతో రెండు రోజుల క్రితం గోపాల్ తన భార్య సుజాతను హత్య చేసి.. అనంతరం ఆ మృతదేహాన్ని వనిపెంట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పడేశారు. ఈ దారుణ ఘటన తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన గోపాల్, తానే హత్య చేశానని లొంగిపోయాడు. ఇక, గోపాల్ ఇచ్చిన సమాచారం మేరకు చాపాడు పోలీసులు వనిపెంట అటవీ ప్రాంతంలో సుజాత మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుడు గోపాల్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.