Site icon NTV Telugu

ZPTC Vote Counting: నేడు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప్ప ఎన్నికల కౌంటింగ్.. ఫలితాలపై ఉత్కంఠ..!

Zptc Vote Counting

Zptc Vote Counting

ZPTC Vote Counting: కడప జిల్లాలో ఆసక్తికరంగా మారిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నేడు ఫలితాలు తెలిపోనున్నాయి.. కడప రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.. జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.. పులివెందుల ఉపఎన్నికల కౌంటింగ్‌ కోసం 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా.. ఒకే రౌండ్‌లో ఫలితం తేలిపోనుంది.. మరోవైపు, ఒంటిమిట్ట ఉపఎన్నికలకు 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా.. 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.. ఒక్కో టేబుల్‌కు ఓ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్ల చొప్పున సూపర్‌వైజర్లు, 30 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 60 మంది, స్టాటికల్ అధికారులు ముగ్గురు ఇతర సిబ్బంది కలిపి దాదాపు 100 మంది ఉండేలా ఏర్పాట్లు చేశారు..

Read Also: Sara Tendulkar: తండ్రి బాటలోనే సారా.. త్వరలోనే రిలేషన్‌షిప్‌పై అధికారిక ప్రకటన!

కాగా, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.. ముఖ్యంగా వైఎస జగన్‌ సొంత నియోజకవర్గంలోని పులివెందుల ఫలితాల కోసం అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.. అసెంబ్లీ ఎన్నికలను తలదన్నే విధంగా ఈ ఎన్నికలు నువ్వా నేనే అనే తరహాలో జరిగాయి.. మరోవైపు, పులివెందులలో పోలింగ్‌లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో.. ఈసీ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం.. బుధవారం రోజు 3, 14వ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించిన విషయం విదితమే.

Exit mobile version