YS Jagan : విజయ్‌కు జగన్ అభినందనలు.. ‘తొలి అడుగులోనే అద్భుతం’ అంటూ ట్వీట్.!
- విజయ్ విజయంపై జగన్ ప్రశంసల వెల్లువ
- 'తొలి అడుగులోనే అద్భుతం' అంటూ ట్వీట్
- బెంగాల్ ఫలితాలపై కూడా జగన్ స్పందన
- బీజేపీకి అభినందనలు.. మమతాకు సానుభూతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన దళపతి విజయ్ (TVK)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్‌ను ‘ప్రియమైన సోదరుడు’ అని సంబోధిస్తూ జగన్ ఒక భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. “నా ప్రియమైన సోదరుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి, అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం నిజంగా అద్భుతం” అని కొనియాడారు.
రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజా సేవకు సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో, విజయ్‌కు కావాల్సిన ఆత్మబలం, విజయం చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో దేవుడు మీకు తోడుగా ఉంటాడంటూ ఆశీస్సులు అందజేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కూడా వైఎస్ జగన్ స్పందించారు. అక్కడ ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (BJP)కి ఆయన తన అభినందనలు తెలియజేశారు. ఇదే సమయంలో, ఎన్నికల్లో ఓటమి పాలైన మమతా బెనర్జీ (దీదీ) పట్ల ఆయన సానుభూతిని వ్యక్తపరిచారు. మమతా బెనర్జీకి తన సానుభూతిని ప్రకటిస్తున్నట్లు జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.
Also Read
- Penukonda Tragedy: దసరా సెలవుల్లో విషాదం.. గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఐదుగురు మృతి
- YS Jagan: ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడతాం.. న్యాయపోరాటం చేస్తాం..
- Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
- YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
-
OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!