YS Jagan: థకాలకు కేటాయింపులు చేయకుండా చంద్రబాబు బడ్జెట్ ప్రవేశ పెట్టారు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. 8 నెలలు ఓటాన్ బడ్జెట్ అకౌంట్ తో ప్రభుత్వాన్ని నడిపారు.. మరో 4 నెలలు మాత్రమే సమయం ఉండగా ఇప్పుడు బడ్జెట్ పెట్టారు.. బడ్జెట్ ప్రవేశ పెడితే చంద్రబాబు చేసిన మోసాలు ప్రజలకు తెలుస్తాయని ఈ సాగతీత చేశారు.. ఈ విషయం తెలిసే బడ్జెట్ ప్రవేశ పెట్టడంలో సాగదీశారు.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఆరోపణలు చేసి బడ్జెట్ ఆలస్యానికి కారణమైందన్నారు. బడ్జెట్ పత్రాలే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని చెబుతున్నాయి.. ఆర్గనైజ్డ్ క్రైం చంద్రబాబు ఎలా చేస్తారో బడ్జెట్ చూస్తే అర్థం అవుతుంది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Read Also: MS Dhoni Cast Vote: ఇదేం క్రేజ్ భయ్యా.. ఓటు వేయడానికి వచ్చిన ధోనికి ఏకంగా?
అలాగే, చంద్రబాబు ఇంతకాలం బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా సాగదీశారని మాజీ సీఎం జగన్ అన్నారు. బడ్జెట్ ప్రవేశ పెడితే చంద్రబాబు అబద్దాలు, మోసాలు బయటపడతాయని భయపడ్డారు.. ఇక, సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలు నిలదీస్తారని భయపడ్డారు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందని తప్పుడు ప్రచారం చేశారు.. ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ ను ప్రవేశ పెట్టారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాటలు డ్రామాలు అని బడ్జెట్ లో తెలిసిపోయింది.. పరిమితికి మించి అప్పులు చేశామని తప్పుడు ప్రచారం చేశారు.. ఒక పద్దతి ప్రకారం మా ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేశారని ఆరోపించారు. కానీ, చంద్రబాబు, జగన్ ముఖాన్ని ఏ బ్యాంకులు రుణాలు ఇవ్వవు అని జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.