YS Jagan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన వర్క్ స్టైల్ మార్చారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ (ఫిబ్రవరి 11) బెంగుళూరు నుంచి తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి రాగానే ఆయన అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీలోని అంతర్గత విషయాలపై ఎప్పటికప్పుడు వారితో చర్చిస్తున్నారు.
Read Also: MP Midhun Reddy: రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం వారితో కలిసి ముందుకెళ్తాం..
అయితే, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్నీ నిర్ణయాలను ముఖ్య నేతలతో చర్చించి మాజీ సీఎం, వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. గుంటూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన పలు పార్టీ అంశాలపై వారు ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, పోలవరం, హామీల అమలు తీరుపై చర్చ జరిపినట్లు తెలుస్తుంది. జగన్ సమావేశానికి ముఖ్య నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మల్లాది విష్ణు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, నందిగాం సురేష్, గోరంట్ల మాధవ్, కొట్టు సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.