CM Chandrababu: విజయవాడలోని పున్నమి ఘాట్ కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులకి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్నితో పాటు పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. నారా భువనేశ్వరితో పాటు దీపోత్సవం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణ ఉత్సవాలు దసరా నుంచి ప్రారంభించి దీపావళి వరకూ నిర్వహిస్తున్నాం.. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు అందుతున్న ప్రయోజనాల గురించి విజయవాడలో కొందరు వీధి వ్యాపారులు, దుకాణాలను సందర్శించి వారితో మాట్లాడి తెలుసుకున్నాను.. ఓటు అనే ఆయుధంతో చీకటి పాలనను ప్రజలు తరిమేశారు.. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసుడిని ప్రజలు ఓడించారు.. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమిని 94 శాతం స్ట్రైక్ రేట్ తో ప్రజలు గెలిపించారు.. రాష్ట్రంలో మళ్ళీ వైకుంఠ పాళి వద్దు అని సూచించారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ప్రాణం పోసింది.. 16 నెలల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టామని చంద్రబాబు నాయుడు తెలిపారు.
Read Also: Team India Loss Reasons: టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఇవే!
ఇక, సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఉద్యోగులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు కల్పించామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఒక డీఏ ఉద్యోగులకు, పోలీసులకు ఒక సరెండర్ లీవ్‌ను మంజూరు చేశాం.. త్వరలోనే ఈహెచ్‌ఎస్‌ను కూడా గాడిలో పెడతాం.. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నాము.. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు, వ్యాపారులకు, పరిశ్రమలకు ప్రయోజనాలు కలుగుతున్నాయన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతీ కుటుంబానికి రూ.15 వేలు ఆదా అవుతోందని చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణం కూడా వేగంగా చేపడుతున్నాం.. ప్రతీ ఇంటిలో ఒక పారిశ్రామిక వేత్త ఉండాలి.. ఏపీ ఇక ఏఐగా మారాలని సూచించారు. విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ వల్ల ఇతర దేశాలకు సేవలు అందుతాయి.. 2027 డిసెంబర్ కు పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చాం.. పీ4 అనుసంధానం ద్వారా పేదలకు చేయూత ఇచ్చి జీవన ప్రమాణాలను పెంచుతామన్నారు. అయితే, 2047 నాటికి భారత్ ప్రపంచలో నెంబర్ వన్ గా మారుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందులో స్వర్ణాంధ్ర కూడా అగ్రస్థానంలో ఉంటుంది.. తద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా గణనీయంగా పెరుగుతుంది.. ఏపీకి కావాల్సింది సుస్థిరమైన పాలనే.. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
