Site icon NTV Telugu

Vijaya Sai Reddy: బాబూ.. మీరు సర్పంచ్‌ల సదస్సు పెట్టింది అందుకేనా?

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం నాడు చంద్రబాబు సర్పంచుల అవగాహన సదస్సులో ప‌లు కీలక సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వం విధిస్తోన్న ప‌న్నులు వంటి ప‌లు అంశాల‌పై చంద్రబాబు విమర్శలు చేయడం, చెత్తపన్ను వసూలు చేయబోమని పంచాయతీలు తీర్మానం చేయాలని సూచించ‌డం వంటి అంశాల‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా మండిప‌డ్డారు.

‘చంద్రబాబు గారు సర్పంచుల సదస్సు పెట్టింది ప్రభుత్వాన్ని ఎలా బ్లాక్ మెయిల్ చేయొచ్చో నేర్పించడానికా? మీ హయాంలో ఉపాధి హమీ పనుల దోపిడీ వివరాలు కేంద్రం దగ్గర ఉన్నాయి. దొంగే దొంగ అని అరవడం కొత్తకాదు గదా మీకు. ‘నరేగా’లో 7 వేల కోట్ల అవినీతి జరిగితే ఫిర్యాదు చేయకుండా ఎవరు ఆపారు మిమ్మల్ని?’ అని విజ‌య‌సాయిరెడ్డి ఈరోజు ట్వీట్ చేశారు.

Exit mobile version