Site icon NTV Telugu

VijayasaiReddy: నారా లోకేష్-యష్ భేటీపై వైసీపీ ఎంపీ సెటైర్లు

Nara Lokesh

Nara Lokesh

VijayasaiReddy: ఇటీవల టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్, కన్నడ హీరో యష్ భేటీ కావడంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. పప్పు పాదయాత్రకు జనాలు పోటెత్తాలంటే పాన్ ఇండియా మూవీ హీరోలను రప్పించాలంటూ చురకలు అంటించారు. ‘ఉ(య)ష్! వాళ్లు రాకపోతే? హోటళ్లు, షూటింగ్ స్పాట్లకు ఏ దిగ్గజ దర్శకుడి రిఫరెన్సుతోనో లేకేషే వెళ్లి కలవాలి. ఛార్టర్డ్ ఫ్లైట్లు, కోట్లల్లో పారితోషికం అరేంజ్ చేయాలి. ఇదీ బొల్లి నాయుడు స్కెచ్’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

అటు టీడీపీ అధినేత చంద్రబాబును కూడా విజయసాయిరెడ్డి టార్గెట్‌ చేశారు. ‘చంద్రం బతుక్కి అన్నీ ప్రీప్లాన్డ్ ఏర్పాట్లే! ఢిల్లీ వెళ్తే విగ్గు, ఇద్దరు గజ్జిగాళ్లని తోడ్కొని పోయే ఏర్పాటు. ఐఎస్బీ మీటింగ్ లాంటిదైతే అప్పట్లో వీపు గోకిన వాళ్లతో గిలిగింతలు. కృత్రిమ బిల్డప్పులు. లక్ష చేయించుకో. ప్రజలు మాత్రం నిన్ను నమ్మే ఛాన్సేలేదు చంద్రం’ అంటూ విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు.

Read Also: Hair Colouring: జుట్టుకు రంగు వేస్తున్నారా? జాగ్రత్త

Exit mobile version