ఇప్పటి కాలుష్య వాతావరణంతో కొంతమందికి జుట్టు రంగు తెల్లగా మారిపోతుంది.

తెల్ల వెంట్రుకలు కనిపించకుండా ఉండటానికి లేదా  స్టైల్ కోసం జుట్టుకు రకరకాల రంగులు వేసుకుంటున్నారు.

ఇలా జుట్టుకు కలర్ ఎక్కువగా వేయడం వల్ల ఆరోగ్యపరంగా నష్టాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

జుట్టుకు వేసే రంగులు కొన్ని రకాల రసాయనాలతో తయారు చేస్తారు.

చేతులతో జుట్టు కలర్ చేస్తే, వాటిలో ఉండే కెమికల్స్ చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. 

జుట్టు కలర్ వేసేప్పుడు చేతులకు బ్లౌజులు వేసుకోవాలి. 

ఈ రంగుల్లో ఉండే రసాయనాలు కొంతమందికి సెట్ కాకపోవటం వల్ల తల భాగంలో చర్మ సమస్యలు తలెత్తుతాయి. 

ఇలా రసాయనాలు ఉన్న రంగులను జుట్టుకు వాడటం కంటే, సహజంగా దొరికే హెన్నా వంటివి వాడటం బెటర్.

జుట్టుకు వేసే రంగుల్లో ఉండే రసాయనాలు కొంతమందికి పడక జుట్టుకూడా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది.

జుట్టుకు  రంగు వేసేప్పుడు కాస్త జాగ్రతలు పాటించండి. సహజమైన రంగునే వాడేందుకు ఉపయోగించేలా చూసుకోండి