Site icon NTV Telugu

OG: ఓజీ సినిమా టికెట్ ధరలపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు..

Og

Og

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’. హరిహర వీరమల్లు తర్వాత వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, పాటలు ఈ మూవీపై అద్భుతమైన బజ్‌ను సృష్టించాయి. ఈ నెల 25వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎక్స్ (ట్విట్టర్) లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

Read Also: Cyber Fraud: సైబర్ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల అంతర్రాష్ట్ర ఆపరేషన్

అయితే, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ నటిస్తున్న ఓజీ సినిమాకు అధిక టికెట్ ధర ఇచ్చినట్టే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉల్లి రైతులకు, వరి రైతులకు, మిర్చి రైతులకు కూడా మద్దతు ధర కల్పిస్తున్నట్టు ఒక జీవో ఇవ్వచ్చు కాదా పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. పెయిడ్ ఆర్టిస్టుకు లాభం కోసమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.. కానీ, పేదల కోసం, రైతుల కోసం కాదంటారా? అంటూ ఎమ్మెల్యే చంద్రశేఖ్ ట్వీట్ లో ప్రశ్నించారు.

Exit mobile version