NTV Telugu Site icon

Andhra Pradesh: బస్సు యాత్ర పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రులు

Ycp Bus Yatra

Ycp Bus Yatra

ఏపీలో ఈనెల 26 నుంచి 29 వరకు వైసీపీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు గురువారం నాడు మంత్రులు బొత్స, ధర్మాన, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున బస్సు యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయ భేరీ పేరుతో బస్సు యాత్రను చేపడుతున్నామని వెల్లడించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు వరుసగా నాలుగు బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి ప్రారంభమై అనంతపురంలో ముగుస్తుందన్నారు.

బస్సు యాత్రలో 17 మంది మంత్రులతో పాటు వైసీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధులు పాల్గొంటారని మంత్రి ధర్మాన వెల్లడించారు. పాలన చేసే వారుగా ఎప్పుడు మారతాం అన్న ఆవేదన ఈ నాలుగు వర్గాల్లో ఉందని.. వీరి ఆత్మ ఘోషణను నివారించడానికి వైసీపీ కంకణం కట్టుకుందని తెలిపారు. గతంలో బలహీన వర్గాలకు మంత్రి పదవి ఇస్తే చాలా గొప్ప విషయంగా భావించే వారు అని.. వెనుకబడిన వర్గాల వారు మంత్రి పదవులు పొందడానికి అర్హులు కారనే భావజాలం ఉండేదని.. కానీ ప్రస్తుత కేబినెట్‌లో 77 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే ఉండటం గమనించాల్సిన విషయమని మంత్రి ధర్మాన అన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో బలహీన వర్గాలకు ఒక రాజ్యసభ స్థానం ఇచ్చిన దాఖలాలు కూడా లేవని.. కానీ టీడీపీ వాళ్లు మాత్రం ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Somu Veerraju: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలి

అటే ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయలేదని చెప్పి నమ్మించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని మంత్రి ధర్మాన విమర్శించారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడానికే తాము బస్సు యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభకు ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేస్తే తెలంగాణ వ్యక్తి అంటున్నారని… చంద్రబాబు ఎక్కడ ఉంటున్నారో చెప్పాలని మంత్రి ధర్మాన సూటిగా ప్రశ్నించారు. ప్రాంతం ముఖ్యం కాదని.. బీసీ వర్గాలకు ఆర్.కృష్ణయ్య చేసిన కృషిని గుర్తించామని తెలిపారు. 77 శాతం బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించామని మంత్రి ధర్మాన గుర్తుచేశారు.

 

Show comments