Site icon NTV Telugu

టీడీపీ జూమ్ పార్టీగా మారింది…

టీడీపీ పార్టీ నుంచి జూమ్ పార్టీ గా మారింది. చంద్ర బాబు నాయుడు జూమ్ పార్టీ అధ్యక్షులు అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. కరోనా వచ్చిన జగన్ అని ప్రాజక్ట్ లు పూర్తి చేయడానికి పని చేస్తున్నారు. కరోనా వచ్చాక మీరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కేవలం జూమ్ ల ద్వారా విమర్శలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాన్ని కూడా అవ్వలేదు. ప్రతి పక్ష నాయుకుడిగా ప్రజల కోసం ఏం చేసారో చెప్పాలి. రాష్ట్రం లో ప్రజా సమస్య పై పోరాడడానికి మీకు అవకాశం లేదు. జూమ్ పార్టీ పిల్ల బాబులా పని చేస్తున్నారు లోకేష్ అని తెలిపాడు. పోలవరం, వేలంగొడ ను జగన్ పూర్తి చేస్తారు… వైఎస్సార్ మొదలు పెట్టారు కొడుకు పూర్తి చేస్తారు. నీలాంటి వారు పోలవరాన్ని ఓపెన్ చేస్తే కొంప కొలేరు అవుతుంది. జూమ్ లో మీరే సీఎం గా ప్రకటించుకో… మీ పార్టీ వారని హైరిటేజ్ లో పని చేసే వారిని ఐఏఎస్. ఐపీఎస్ గా ప్రకటించుకో అని పేర్కొన్నారు.

Exit mobile version