రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్‌లో ఉన్న సారథి ఆస్పత్రిలో పూజలు చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆసుపత్రి యజమాని పార్థసారధి ఆధ్వర్యంలో ఆస్పత్రి ఆవరణలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో డాక్టర్ సారధి భార్య చంద్రకళ భయాందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన దశ మహా విద్య, ధూమావతి, ప్రత్యంగిర చినమస్త అనేవి తాంత్రిక పూజలు అని ఆమె ఆరోపించారు.
అయితే ఈ పూజలపై ఆస్పత్రి యజమాని పార్థసారధిని వివరణ అడగ్గా.. ఇది సాధారణ పూజలేనని.. ఇంట్లో చేసుకునే పూజలే అని సమాధానం ఇచ్చారు. ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది చనిపోవడంతోనే ఈ పూజలు నిర్వహించామని చెప్పారు. అయితే ఆస్పత్రి, పేషెంట్లు ఉన్న ఆస్పత్రి ప్రాంగణంలో డాక్టర్లు ఇలాంటి పూజలు చేయకూడదని డాక్టర్ సారధి భార్య చంద్రకళ ఆరోపిస్తు్నారు. మెడికల్ కౌన్సిల్, వైద్య రంగానికే ఇలాంటి పూజలు విరుద్ధం అని… పోలీసులు వెంటనే సారథి ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
