Site icon NTV Telugu

Kurnool: ఫేస్‌బుక్ ఫ్రెండ్‌కి బుద్ధి చెప్పిన యువతి

Fb,

Fb,

సోషల్ మీడియాను కొందరు మంచి పనుల కోసం వినియోగిస్తోంటే, మరికొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరైతే ఏకంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అందమైన అమ్మాయిల్ని టార్గెట్ చేసి రిక్వెస్టులు పెట్టడం, యాక్సెప్ట్ చేశాక మాయమాటలు చెప్పి వలలో వేసుకోవడం, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కి పాల్పడ్డం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకోగా, తాజాగా మరో వ్యవహారం తెరమీదకొచ్చింది.

Read Also: YCP Leader Murder Case: పథకం ప్రకారమే వైసీపీ నేత హత్య..

ఆ అబ్బాయి పేరు శానవాజ్. ఏలూరుకి చెందిన ఓ అమ్మాయితో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్నాడు. తొలుత మాయమాటలు చెప్పి, ఆమెని తన బుట్టలో పడేసుకున్నాడు. పాపం, ఆ అమ్మాయి అతడ్ని నమ్మి, అడిగిన వెంటనే ఫోటోలు పంపించింది. అప్పుడే అతడు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆ అమ్మాయి, మరో దారి లేక అతనికి డబ్బులిచ్చింది.

అయినప్పటికీ శానవాజ్ ఆ యువతి ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో, ఆ యువతి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, పోలీస్ స్టేషన్ సమీపంలోనే చెప్పుతో కొట్టి, అతనికి తగిన గుణపాఠం నేర్పింది. సైబర్ నేరాలు ఎన్నో వెలుగుచూస్తోన్నా, అమ్మాయిలు ఆకతాయిల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలని సూచిస్తున్నారు.

Exit mobile version