Site icon NTV Telugu

Andhra Pradesh Crime: బ్లేడుతో ప్రియుడి మర్మాంగం కోసేసిన ప్రియురాలు.. ఎందుకంత కసి..?

Woman

Woman

వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను కూలుస్తున్నాయి.. ప్రాణాలు తీస్తున్నాయి.. పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి.. కొందరు ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. పెద్దల అనైతిక సంబంధాలు పిల్లలను కూడా పొట్టనబెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి… అయితే, బ్లేడుతో ఓ మహిళ తన ప్రియుడి మార్మాంగాన్ని కోసేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది… ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొండపి మండలంలోని మూగచింతల గ్రామంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసి పరారైంది..

Read Also: BIG Breaking: మూడు రాజధానులపై సుప్రీంకి ఏపీ సర్కార్‌.. అది సాధ్యం కాదు..!

మూగచింతలకు చెందిన 60 ఏళ్ల బాధితుడికి అదే గ్రామానికి 55 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం ఉంది.. దాదాపు పదేళ్లుగా వీరి మధ్య సంబంధం కొనసాగుతూ వస్తుంది.. అయితే, వీరిద్దరికి మధ్య ఆర్థిక సంబంధాలతో పాటు మరికొన్ని సమస్యలు కూడా వచ్చి చేరాయి.. దీంతో.. వారి బంధం కొంత చెదిరిపోయింది.. కానీ, ఇద్దరి మధ్య మనస్పర్థల నేపథ్యంలోనూ ఇంటికి వచ్చిన ప్రియుడి మార్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది సదరు మహిళ.. వెంటనే పొరుగువారు బాధితుడిని ఒంగోలు రిమ్స్‌లో చేర్చారు. అయితే, బాధితుడి ఫిర్యాదు మేరకు కొండపి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. బుధవారం రోజు ఈ ఘటన జరిగినా.. ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియురాలు చేసిన ఆ పనికి స్థానికులంతా అవాక్కవుతున్నారు..

Exit mobile version