Site icon NTV Telugu

MP Midhun Reddy: రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం వారితో కలిసి ముందుకెళ్తాం..

Mithunreddy

Mithunreddy

MP Midhun Reddy: పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలు లేవనేత్తామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు.. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావడానికి రూ. 60 వేల కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పోలవరం కి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గితే పూర్తిగా నష్టం జరుగుతుంది.. పోలవరంలో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. కేంద్రం పోలవరంకు డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్రం భరిస్తుందా?.. అని క్వశ్చన్ చేశారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని కోరాం.. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇవ్వడం బాగానే ఉంది.. కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పండి.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ “ఎయిర్ ఇండియా”కు కూడా ముందుగా నిధులు ఇచ్చారు.. ఆ తర్వాత దాన్ని అమ్మేశారు అంటూ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు.

Read Also: GHMC: స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ప్రారంభమైన కార్పొరేటర్ల నామినేషన్లు..

ఇక, టీడీపీ ఎంపీలు వ్యక్తిగతంగా మమ్మల్ని తిడుతున్నారు అని మిథున్ రెడ్డి తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఎంపీలతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం మీ మద్దతుతో నిలుస్తుందని అంటున్నారు.. మరి ఆ స్థాయిలో నిధులు ఎందుకు తెచ్చుకోవడం లేదు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కొరకు తెలుగు దేశం పార్టీ ఎంపీలు గట్టిగా మాట్లాడాలి అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version