Site icon NTV Telugu

Andhra Pradesh: టీవీ చూస్తున్న భార్య.. ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త

Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh: రోజురోజుకు చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. భర్త తన మాట వినలేదని భార్యలు.. భార్య చెప్పింది చేయలేదని భర్తలు చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న మనస్పర్థలు తలెత్తే పరిష్కరించుకోవాల్సింది పోయి కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక ఈ మధ్య మనం గమనించాల్సింది ఏంటంటే టీవీ సీరియల్స్‌ పై వున్న పిచ్చి. అది లేనిదే మన జీవితం లేదని అందులో నిమగ్నమై పోతారు. సీరియల్స్‌ జీవితంలో ఒక భాగమై పోయాయి. ఒక వేళ ఆసీరియల్‌ టైం కి కరెంట్‌ పోయిందో ఫోన్లు చేసుకుని రాష్ట్రాలు దాటైన సరే దాని గురించి ఆరా తీస్తారు. అందులో మోసపోయిన నటి నటీమనుల ఏడుస్తున్న అయ్యో పాపం అంటూ కన్నీల్లు పెట్టుకుంటాం కానీ ఇంట్లో ఉన్న భర్త, పిల్లలను గాలి కొదిలేస్తున్నామనే జ్ఞానం మనం కోల్పోతున్నాం. దాంతో భర్తలు తలలు పట్టుకుంటున్నారు. నేను ఇంటికి వచ్చానే తల్లీ.. అని వేడుకున్నా.. ఆగండి ఆ సీరియల్‌ అయిపోని అంటూ దాటేస్తుండటంతో చివరికి భర్తలు ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం చర్చకు దారితీస్తున్నాయి. ఇదే కోవకు చెందిందే ఈ ఘటన. తన భార్య టీవీ చూస్తూ తనను పట్టించుకోలేదనే కారణంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నవ్వాలో అయ్యో అనాలో అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ఆంధ్రపద్రేశ్‌ లోని అన్నమయ్య జిల్లాలో ఈఘటన చోటుచేసుకుంది.

Read also: Lightyear 0: ప్రపంచంలోనే తొలి సోలార్ కార్..నడుస్తున్నప్పుడే ఛార్జింగ్.. రేంజ్ ఎంతో తెలుసా..?

అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడులో మనోహర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దానికి కారణం భార్య తనని పట్టించుకోకుండా టీవీ చూస్తున్నదనే కోపం. రోజూమాదిరిగానే భర్త మనోహర్‌ ఇంటికి వచ్చాడు. భార్య టీవీ సీరియల్‌ లో నిమగ్నమైపోయింది. భర్త వచ్చింది కూడా ఆమె గమనించలేదు. దీనిపై కోపంతో ఊగిపోయిన భర్త.. భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మందలించడంతో భార్య భర్తపై తిరగబడింది. దీంతో తీవ్ర మస్తాపానికి గురైన భర్త చనిపోవాలని అనుకున్నాడు. తనని భార్య పట్టించుకోకుండా టీవీ సీరియల్‌ చూస్తూ తనని పక్కన పెట్టేసిందనే ఆవేదనతో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో.. కుటుంబ సభ్యులు తల పట్టుకున్నారు. సీరియల్‌ చూసి భర్తను పక్కన పెట్టడం ఏంటని విమర్శిస్తున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ మనోహర్ రెడ్డి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికైనా నా భార్య నన్ను పట్టించుకుంటే మంచిదని పాపం ఆభర్త చెప్పడం ప్రతి ఒక్కరికి కలిచివేస్తుంది. టీవీ సీరియల్‌ చూడటం తప్పు కాదు కానీ.. సీరియల్స్ చూడటానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. టీవీ సీరియల్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ కాస్త పిల్లలపై భర్త పై పెడితే బాగుంటుంది. సీరియల్స్ చూస్తూ కుటుంబాన్ని పక్కన పెడితే మాత్రం ఏదైనా జరగరానిది జరిగితే ఆటీవీ సీరియల్ లో వున్న యాక్టర్లు వచ్చి సహాయం చేయరు అనేది మనం గుర్తు పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఎవరి జీవితంలో వచ్చే కష్టాలు వారే అనుభవించాలి సుమీ..!
Varisu: ‘దళపతి’ రెండో పాట సిద్ధం

Exit mobile version