NTV Telugu Site icon

Wife Protests at Husbands Home: భర్త కోసం భార్య అలుపెరుగని పోరాటం

Wife

Wife

భర్త కాపురానికి రానివ్వట్లేదని, తన భర్త తనకు కావాలని ఓ ఇల్లాలు కర్నూలు జిల్లాలో భర్త ఇంటి ముందు పోరాటానికి దిగింది. ఉన్నత విద్య చదివిన తనపై పిచ్చి పట్టిందనే ముద్ర వేసి తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ ఇల్లాలు వారం రోజులపాటు భర్త ఇంటి ముందే ఒంటరి పోరాటం చేస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం లొద్దిపల్లి లో బెల్లం విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి ముందు వారం రోజులుగా భర్త కోసం పోరాటం చేస్తోంది. నంద్యాల జిల్లా గడివేముల మండలం పెసరవాయికి చెందిన ఉమామహేశ్వరికి 2017 లొద్దిపల్లికి చెందిన బెల్లం విష్ణువర్ధన్ రెడ్డితో వివాహమైంది. పెళ్లి సందర్భంగా 30 లక్షల రూపంలో కట్నకానుకలు ఇచ్చారు.

విష్ణువర్ధన్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. అయితే పెళ్లయిన రెండు వారాలకే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలొచ్చాయి. పుట్టింటికి వెళ్లిన ఉమామహేశ్వరిని తిరిగి భర్త ఇంటికి కాపురానికి పంపేందుకు పెద్దనుషుల ద్వారా ప్రయత్నించారు. ఒక దశలో పోలీసులు పంచాయతీ ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశారు. మరో వైపు విడాకులు కావాలంటూ భర్త విష్ణువర్ధన్ రెడ్డి కోర్టు నోటీస్ ఇచ్చారు. భర్త విడాకులు తనకు వద్దంటూ భర్తే కావాలంటూ ఉమా మహేశ్వరి లొద్దిపల్లిలో భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. భర్త ఇంట్లోకి వెళ్లి 5 రోజులు స్వీయనిర్బంధంలో ఉంది. కోడలు ఇంట్లోకి రావడంతో అత్త, మామలు బెల్లం సుధాకర్ రెడ్డి, యశోధమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.

Minister Jagadish Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై మంత్రి జగదీశ్‌ రెడ్డి ఫైర్

కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అక్కడ కరెంట్ సరఫరా కూడా నిలిపివేశారు. ఎవరో ఏదో ఒక పూట ఇంత అన్నం పెడితే తిని వారం రోజులుగా భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు పిచ్చి పట్టిందని ప్రచారం చేసి వదిలించుకోవాలని చూస్తున్నారని, ఇద్దరితో కాపురం చేస్తుందంటూ అక్రమ సంబంధం అంటగట్టే ప్రయత్నం చేసారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తాను భర్తతో కాపురం చేయాలని కోరుకుంటున్నానని, డబ్బులు , ఆస్థులు అవసరం లేదంటుంది ఉమామహేశ్వరి. తనకు న్యాయం చేయాలని , అప్పటి వరకు నా పోరాటం ఆగదని చెబుతుంది ఉమామహేశ్వరి.

ఉమా మహేశ్వరి ఆందోళనపై అత్త యశోద వాదన భిన్నంగా ఉంది. పెళ్లయిన కొత్తలోనే కాపురం చేయకుండా వెళ్ళిపోయి తమపై లేనిపోని కేసులు పెట్టిందని ఆరోపిస్తోంది ఉమామహేశ్వరి అత్త యశోద. తన కుమారుని కేసులతో వేధించారని, విసుగుచెంది భార్య వద్దని విడాకులు కోరుతున్నారని చెబుతోంది. ప్రతిసారి పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తున్నారని చెబుతోందామె. మొత్తమ్మీద లొద్ధిపల్లిలో భర్త కోసం ఉమామహేశ్వరి పోరాటం చర్చనీయాంశమైంది. విష్ణువర్ధన్ రెడ్డి తో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.