Site icon NTV Telugu

AP BJP President: నేడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నోటిఫికేషన్.. కొత్త ప్రెసిడెంట్ ఎవరో..?

Ap Bjp

Ap Bjp

AP BJP President: ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే పార్టీ సంస్థగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా జులై 1వ తేదీన బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈ మేరకు పార్టీ సంస్థగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈరోజు ( జూన్ 29న) ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ జారీతో పాటు అధ్యక్ష ఎన్నిక ఓటర్లను కూడా ప్రకటిస్తామన్నారు.

Read Also: WAR 2 : వార్ 2 తెలుగు కోసం పట్టువదలని టాలీవుడ్ ప్రొడ్యూసర్

ఇక, జూన్ 30వ (సోమవారం) తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్‌లు స్వీకరణ.. ఆ తర్వాత ఒక గంట పాటు నామినేషన్ల స్క్రూటినీ.. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఇవ్వనున్నారు. జులై ఒకటో తేదీన పోలింగ్, రాష్ట్ర అధ్యక్ష పేరు ఖరారు ప్రక్రియ జరగనుంది. అయితే, కర్ణాటక ఎంపీ పీసీ మోహన్‌ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్నారు.

Read Also: 23 Movie : ఓటీటీ స్ట్రీమింగ్ కొచ్చిన చరిత్రలో నిలిచిపోయిన కథ ’23’

అయితే, ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర చీఫ్ మరోసారి పదవిలో పురందేశ్వరి కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డితో పాటు పీవీఎన్‌ మాధవ్, జీవీఎల్‌ నరసింహరావు, సుజనాచౌదరి, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డితో పాటు తదితరులు ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి ఎవరికి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుంది అనేది.

Exit mobile version