NTV Telugu Site icon

AP Assembly: నేడు అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల

Ap

Ap

AP Assembly: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్న ఎన్డీయే కూటమి సర్కార్ ఎక్సైజ్‌ శాఖలో జరిగిన అక్రమాల చిట్టాను విప్పేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు మద్యం అక్రమాలపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేయనున్నారు. తొలుత ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు బిల్లుపై సభలో చర్చించిన ఆమోదం తెలిపిన తర్వాత.. విజయవాడలో యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌సైన్సెస్‌కు ఎన్టీఆర్‌ పేరు పెడుతూ.. చట్టసవరణ చేసే బిల్లుపై చర్చిస్తారు.

Read Also: Budget 2024 : బడ్జెట్‌కు వ్యతిరేకంగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన ఇండియా బ్లాక్ ఎంపీలు

ఇక, అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో విశాఖలో కాలుష్య నియంత్రణ, రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు, కేజీహెచ్​లో బెడ్స్, సిబ్బంది కొరత, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ప్రశ్నలకు మంత్రులకు ఆన్సర్లు ఇవ్వనున్నారు. అలాగే, రైతుల సమస్యలు, టెంపుల్ టూరిజం, ఇసుక తవ్వకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మారిటైమ్ బోర్డు ద్వారా కృష్ణపట్నం పోర్టు లీజు, మత్యకారులకు జీవో 217 ఇబ్బందులపై కూడా సభలో మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.

Read Also: Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురి పరిస్థితి విషమం!

అయితే, మరోవైపు శాసనమండలిలో ఇవాళ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మంత్రి పయ్యావుల కేశవ్ ఆన్సర్ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. ప్రశ్నోత్తరాల్లో గత ప్రభుత్వంలో కల్పించిన గవర్నమెంట్ ఉద్యోగాలు, ఫీజ్ రీఎంబర్స్‌మెంట్‌ స్కీం, పోలవరం ప్రాజెక్టు హెడ్​వర్క్స్, స్టూడెంట్స్ కు ఆర్థిక సాయం, నీటిపారుదల రంగ అభివృద్ధి లాంటి ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు.