★ అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నేటితో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సంబరాలు.. పాల్గొననున్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
★ నేడు ఆత్మకూరు ఉపఎన్నికకు నోటిఫికేషన్.. నేటి నుంచి నామినేషన్‌లు స్వీకరణ.. జూన్ 6వ వరకు నామినేషన్‌కు చివరి గడువు.. జూన్ 23న పోలింగ్.. 26న ఫలితాలు
★ శ్రీకాకుళం: నేడు ఆముదాలవలస రైల్వేస్టేషన్‌లో న్యూ పుట్‌పాత్ బ్రిడ్డి ప్రారంభోత్సవం చేయనున్న స్పీకర్ తమ్మినేని సీతారాం
★ విశాఖ: నేడు కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు ఏఐటీయూసీ పిలుపు.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని డిమాండ్
★ విశాఖ: దావోస్ పర్యటన ముగించుకుని నేడు జిల్లాకు రానున్న పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
★ నంద్యాల: నేడు మహానందిలో మహానందీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు.. శ్రీ కామేశ్వరీ అమ్మవారికి కుంకుమార్చన, సాయంత్రం స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ
★ విశాఖ: నేడు,రేపు కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ పర్యటన.. బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశం.. అధికారిక రివ్యూల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి సోనోవాల్
★ ఖమ్మం: నేడు రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్న వద్దిరాజు రవిచంద్ర.. జిల్లా నుంచి తరలివెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
★ కామారెడ్డి జిల్లా్ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నేడు టీఆర్ఎస్, బీజేపీ నేతల ఆధ్వర్యంలో ప్రజా దర్బార్