Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

★ అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యపై సమీక్ష చేపట్టనున్న సీఎం జగన్.. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో నాడు-నేడు తదితర అంశాలపై చర్చ
★ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి చేరిక.. ప్రధాని మోదీతో భేటీ కానున్న జగన్.. రేపు ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులతో జరుగనున్న న్యాయ సదస్సులో పాల్గొననున్న సీఎం జగన్
★ ఈరోజు తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
★ అనంతపురం: తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నేడు నారీ సంకల్ప దీక్ష కార్యక్రమం.. హాజరుకానున్న టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత
★ నెల్లూరులో నీటి పారుదల సలహా బోర్డు సమావేశం.. హాజరుకానున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు
★ పశ్చిమగోదావరి: నేటి నుంచి రెండు రోజుల పాటు మార్టేరులో గోదావరి మండల పరిశోధన విస్తరణ సాంకేతిక సలహా మండలి సమావేశాలు.. హాజరుకానున్న ఐదు జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు
★ నేడు హైదరాబాద్‌ రానున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. 12 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్న గడ్కరీ.. నేషనల్ హైవేలను జాతికి అంకితం చేయనున్న గడ్కరీ.. శంషాబాద్‌లో ప్రారంభోత్సవ బహిరంగ సభ
★ హైదరాబాద్: ఈరోజు సాయంత్రం 6గంటలకు ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్
★ ఖమ్మం సాయిగణేష్ ఆత్మహత్య ఘటనపై నేడు హైకోర్టులో విచారణ.. సీబీఐ దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్‌పై విచారించనున్న హైకోర్టు
★ ఈరోజు ఢిల్లీలో హైకోర్టు సీజేల సదస్సు.. సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో సదస్సు.. సదస్సులో పాల్గొననున్న 25 హైకోర్టుల సీజేలు
★ ఢిల్లీ: నేడు ఎన్‌టీఏజీఐ సమావేశం.. కరోనా సెకండ్ డోస్ తర్వాత బూస్టర్ డోస్ తీసుకునే వ్యవధి తగ్గింపుపై చర్చ.. 9 నెలల నుంచి 6 నెలలకు కాల వ్యవధి తగ్గించే అవకాశం
★ నేడు ఢిల్లీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పర్యటన.. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మమతా బెనర్జీ మకాం
★ ఐపీఎల్ 2022: నేడు పంజాబ్ కింగ్స్‌తో లక్నో సూపర్‌జెయింట్స్ ఢీ.. పూణె వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్

Exit mobile version