✪ ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా నేటి నుంచి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు… ఈనెల 30 వరకు కొనసాగనున్న ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు
✪ ఏపీలో స్కూళ్ల నిర్వహణపై నేడు అధికారుల కీలక సమావేశం… పాఠశాలల మ్యాపింగ్‌పై ఎమ్మెల్యేలకు మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమం… బడుల నిర్వహణ, టీచర్ల సర్దుబాటుపై నిర్ణయం
✪ ఉద్యోగ సంఘాలతో నేడు ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు
✪ నేటి నుంచి కార్వీ ఎండీ పార్థసారథిని ప్రశ్నించనున్న ఈడీ.. నాలుగు రోజుల కస్టడీకి అనుమతించిన ఈడీ ప్రత్యేక కోర్టు.. ఈనెల 30 వరకు పార్థసారథిని కస్టడీకి అనుమతించిన కోర్టు
✪ నేడు ఎయిరిండియాను టాటా గ్రూప్‌కు అప్పగించనున్న కేంద్ర ప్రభుత్వం… 70 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా గ్రూప్ చేతికి వస్తున్న ఎయిరిండియా
✪ ఢిల్లీ: నేడు ఎన్నికల కమిషన్‌ను కలవనున్న టీఎంసీ ఎన్నికల బృందం.. గోవాలో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ అడ్డుకుందని ఫిర్యాదు చేయనున్న టీఎంసీ
✪ నేడు పంజాబ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం
✪ నేడు నదీ బోర్డు ఛైర్మన్‌లతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్ష… కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్‌లతో వర్చువల్ విధానంలో సమావేశం.. గెజిట్ నోటిఫికేషన్ అమలు పురోగతి, ప్రాజెక్టుల నిర్వహణపై చర్చ
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
