Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

What’s Today:
• ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నేడు సీఎం జగన్ పర్యటన.. చీమకుర్తిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించనున్న సీఎం జగన్.. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్న సీఎం జగన్
• తిరుమల: ఈరోజు ఉదయం 10 గంటలకు లక్కీడిప్ ద్వారా ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ
• నేడు గుంటూరు రూరల్ మండలం దాసు పాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ ఎమ్మెల్యే సుచరిత
• ప్రకాశం: యర్రగొండపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్
• నేడు ఎమ్మెల్సీ అనంత్‌బాబు రెగ్యులర్ బెయిల్‌పై రాజమండ్రి కోర్టులో విచారణ
• నేడు హైదరాబాద్ రానున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్
• నేడు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన బాసర ట్రిపుల్ ఐటీ ఎస్‌జీసీ
• ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతల నిరసన దీక్షలు.. అక్రమ అరెస్టులు, దాడులు, నిర్బంధాలపై నిరసన దీక్షలు.. కరీంనగర్‌లోని తన నివాసంలో దీక్ష చేయనున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్
• నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. మెదక్ జిల్లాలోని పిల్లికొట్టాల గ్రామంలో 564 డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న మంత్రి హరీష్‌రావు

Exit mobile version