Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

★ నేడు ఏలూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన.. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా ఇవ్వనున్న పవన్..
★ విశాఖ: నేటి నుంచి మూడురోజుల పాటు వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళా… ఈ జాబ్ మేళా ద్వారా 23,935 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం
★ నేడు విశాఖ స్టీల్‌ప్లాంట్ గుర్తింపు సంఘం ఎన్నికలు.. 10,589 మంది ఓటర్ల కోసం 17 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్.. రాత్రి 11 గంటల తర్వాత ఎన్నికల ఫలితాలు.. ప్రైవేటీకరణ పోరాటం నేపథ్యంలో కీలకంగా మారిన ఎన్నికలు
★ నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అషానుద్దీన్‌ అమానుల్లా ముఖాముఖి
★ శ్రీకాకుళం: నేడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా‌ భాద్యతలు స్వీకరించనున్న మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
★ విశాఖ నగరంలో నేడు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పర్యటన.. ప్రైవేట్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం
★ ఐపీఎల్ 2022లో నేడు రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనున్న గుజరాత్ టైటాన్స్.. రాత్రి 7:30 గంటలకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో తలపడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

 

Exit mobile version