★ అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం… 32 అంశాలతో కూడిన అజెండాపై కీలకంగా చర్చించనున్న కేబినెట్
★ నేడు విశాఖ రానున్న కేంద్ర చమురు శాఖ సహాయమంత్రి రామేశ్వర్… ఐఐపీఈ తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రామేశ్వర్.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
★ నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాల సమావేశం… ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్న ఉద్యోగ సంఘాలు.. పీఆర్సీపై ఐక్యంగా పోరాటం చేయాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం
నేడు గుడివాడలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన… క్యాసినో నిర్వహణపై టీడీపీ ఆధ్వర్యంలో విచారణ… కమిటీలో మాజీ ఎంపీ కొనకళ్ల, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, తంగిరాల సౌమ్య
★ తెలంగాణలో నేటి నుంచి ఫీవర్ సర్వే
★ నేడు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకానున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్… ఇటీవల కరీంనగర్‌లో పోలీసులు వ్యవహరించిన తీరుపై వివరణ
★ పార్ల్: నేడు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే… మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న దక్షిణాఫ్రికా
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
