Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

★ నేడు ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెంలో పర్యటించనున్న చంద్రబాబు.. అడవినెక్కలం అంబేద్కర్ నగర్ నుంచి నెక్కలం గొల్లగూడెం వరకు పాదయాత్ర.. అనంతరం రచ్చబండ కార్యక్రమం.. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న చంద్రబాబు.. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్న బాబు
★ నేడు విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ VCICపై కేంద్రం సమీక్ష.. హాజరుకానున్న కేంద్ర పరిశ్రమల శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్
★ తిరుపతి: పుంగనూరు అంజుమన్ షాది మహల్‌లో ఇఫ్తార్ విందుకు హాజరుకానున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి.
★ నంద్యాల: చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నేడు డోన్‌లో రక్తదాన శిబిరం, అన్నదానం నిర్వహించనున్న టీడీపీ శ్రేణులు
★ నేడు ఖమ్మంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పర్యటన.. సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్
★ నేడు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు.. సాయిగణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్.. నేడు పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ నిరసన దీక్ష
★ నేడు వరంగల్, నర్సంపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
★ గుజరాత్‌లో నేడు ప్రధాని మోదీ మూడో రోజు పర్యటన.. గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో పాల్గొననున్న ప్రధాని
ఐపీఎల్ 2022: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న పంజాబ్ కింగ్స్.. ముంబైలోని బ్రబౌర్న్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్

Health Tips: వేసవికాలంలో చెరుకు రసం తాగితే కలిగే ప్రయోజనాలేంటి?

Exit mobile version