Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

★ నేడు ఏపీ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి ఫ్యాప్టో పిలుపు.. కొత్త పీఆర్సీకి నిరసనగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ల ముట్టడి.. ఫ్యాప్టో తలపెట్టిన నిరసనలకు ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు.. డివిజన్ కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చిన జాక్టో.. భోజన విరామ సమయాల్లో సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. సమ్మెకు వెళ్లాలని ఉద్యోగుల నిర్ణయం
★ అమరావతి: ఉండవల్లి హోం ఐసోలేషన్‌లో ఉంటూ నియోజకవర్గాల వారీగా ఆన్‌లైన్‌లో సమీక్ష చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు
★ కరోనా నియంత్రణపై నేడు తెలంగాణ మంత్రుల సమీక్ష… అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యశాఖ అధికారులతో సమీక్షించనున్న మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, ఎర్రబెల్లి.. జిల్లాల వారీగా కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆరా
★ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో ప్రసవాలు బంద్

Exit mobile version