Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

★ విశాఖలో నేడు సీఎం జగన్ పర్యటన.. నేడు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ కానున్న సీఎం జగన్
★ విశాఖ: నేటి నుంచి రెండు రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన.. పద్మనాభం మండలం పాండ్రంగిలో అల్లూరి సీతారామరాజు స్వస్థలం, ఇంటిని సందర్శించనున్న వెంకయ్య.. సాయంత్రం ప్రేమ సమాజం వేడుకల్లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి
★ గుంటూరు: చెరుకుపల్లిలో నేడు గ్రామ వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం.. హాజరుకానున్న రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు
★ శ్రీకాకుళం: నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమీక్షా సమావేశం
★ అమరావతి: నేడు తాడేపల్లిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన.. U-1 రైతులను పరామర్శించనున్న సోము వీర్రాజు.. పంటపొలాలపై విధించిన రిజర్వ్ జోన్ ఎత్తివేయాలని గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులు
★ అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నేటి నుంచి ఓపీ సేవలు ప్రారంభం
★ అనంతపురం: కంబదూరు మండలంలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీచరణ్.
★ సత్యసాయి జిల్లా: కదిరి పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిరంలో నేడు మాధవ గురుకులం అనాధ బాలల ఆశ్రమ పాఠశాల వార్షికోత్సవం.. హాజరుకానున్న పరిపూర్ణానంద స్వామి
★ నేడు మెదక్ జిల్లా రామాయంపేటకు వెళ్లనున్న ఈటల రాజేందర్.. నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సంతోష్ కుటుంబాన్ని పరామర్శించనున్న ఈటల
★ నేడు ఖమ్మంలో టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ పర్యటన.. మే 6న జరిగే రాహుల్ రైతు సంఘర్షణ సభపై జిల్లా నాయకులతో సమీక్ష.. అనంతరం మధిరలో భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొననున్న మధుయాష్కీ
★ నేడు ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడి చేసే అవకాశం.. బ్రిటీష్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక
★ ఐపీఎల్ 2022: నేడు లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్

Exit mobile version