★ ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ… కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
★ నేడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 26వ వర్థంతి… ఏపీ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయం… ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్న టీడీపీ శ్రేణులు
★ నేడు ఏపీలోని 37 గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం… క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రారంభించనున్న సీఎం జగన్
★ నేడు ఏపీలో పీఆర్సీపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఫ్యాప్టో నిరసలు.. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించిన విధులకు హాజరుకావాలని ఫ్యాప్టో పిలుపు
★ కరోనా నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ఫిబ్రవరి 4 వరకు అన్ని కోర్టుల్లో వర్చువల్‌గా కేసుల విచారణ
★ నేడు వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన రద్దు.. కేసీఆర్ బదులు వరంగల్‌లో పర్యటించనున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, అధికారులు
★ నేడు పంజాబ్ ఎన్నికలలో ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న అరవింద్ కేజ్రీవాల్
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
