Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

★ ఏపీ అసెంబ్లీలో ఉదయం 11 గంటలకు హౌస్ కమిటీ భేటీ.. భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన హౌస్ కమిటీ సమావేశం.. పెగాసస్ వ్యవహారంపై చర్చించనున్న హౌస్ కమిటీ.. ఇవాళ హోంశాఖతో పాటు వివిధ శాఖలతో కమిటీ భేటీ
★ అమరావతి: నేటి నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు… నేడు అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు.. ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా పేరుతో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు
★ తిరుమల: నేడు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణ టోకెన్‌లు విడుదల.. రోజుకు 750 చొప్పున జూలై నెల టోకెన్‌లను విడుదల చేయనున్న టీటీడీ
★ కర్నూలు: నేడు శ్రీశైలం ఆలయంలో అన్నపూర్ణదేవి విగ్రహ ప్రతిష్ఠ, శిఖరప్రతిష్ట, పూర్ణాహుతి.. పాల్గొననున్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
★ నెల్లూరు జిల్లా: నేడు ఆత్మకూరులో వైసీపీ ఆధ్వర్యంలో మైనారిటీల సదస్సు.. హాజరు కానున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
★ రాహుల్ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ నేడు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు.. హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిరసన చేయాలని టీ కాంగ్రెస్ నిర్ణయం
★ ఢిల్లీ: నేడు రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌, నేటి నుంచే ప్రారంభంకానున్న నామినేషన్ల స్వీకరణ, ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు విపక్షాల యత్నం, రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నం
★ ఢిల్లీ: నేడు మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్‌ను నిలిపేందుకు చర్చలు.. నేడు విపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ దూరం.. ప్రతినిధులను కూడా పంపకూడదని టీఆర్ఎస్ నిర్ణయం

 

Exit mobile version