★ గుంటూరు: నేడు ఇప్పటం గ్రామ పరిధిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు… సభకు హాజరుకానున్న పవన్ కళ్యాణ్.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న జనసేన బహిరంగ సభ
★ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. నాటుసారా మృతుల కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు
★ నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు.. సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో విజయవాడ.. నోటీసులు ఇచ్చి కార్మికులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు
★ విశాఖ: నేడు సింహాద్రి అప్పన్న ఉపదేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి వార్షిక కళ్యాణం
★ విశాఖ: నేడు ఉపమాక వేంకటేశ్వర స్వామి కళ్యాణం.. కోవిడ్ తర్వాత తొలిసారి భక్తుల సమక్షంలో స్వామివారి పరిణయం
★ నేడు శ్రీశైలంలో సీజేఐ ఎన్వీ రమణ పర్యటన… స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీజేఐ ఎన్వీ రమణ దంపతులు.. అనంతరం కంచిమఠంలో జరిగే హోమ పూర్ణాహుతిలో పాల్గొననున్న సీజేఐ దంపతులు
★ నేటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ సర్వోదయ పాదయాత్ర… ఉ.9 గంటలకు పాదయాత్రను ప్రారంభించనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్.. మొత్తం 600 కి.మీ. సాగనున్న సర్వోదయ పాదయాత్ర
★ నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఉ.11 గంటలకు ప్రారంభం కానున్న ఉభయ సభలు.. నేడు జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
