Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

★ నేడు తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. ఇప్పటికే గోవా, కొంకణ్, కర్ణాటకకు విస్తరించిన రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం
★ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేంద్రమంత్రి జయశంకర్ పర్యటన.. పాడేరు ఏజెన్సీలో పర్యటించనున్న జయశంకర్.. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు, కాఫీ ప్లాంటేషన్‌ల పరిశీలన
★ తిరుమల: ఇవాళ జ్యేష్ఠాభిషేకంలో రెండో రోజు.. ముత్యపు కవచంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి
★ నేటి నుంచి శ్రీశైలంలో మూడురోజుల పాటు నూతన అన్నపూర్ణదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం.. నేడు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, అంకురారోహణ, అగ్నిప్రతిష్టాపన
★ గుంటూరు: నేడు పెదకాకాని మండలం అనమర్లపూడిలో అక్రమ మట్టి తవ్వకాలు జరిగిన ప్రాంతాలను‌ పరిశీలించనున్న టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర
★ తెలంగాణలో నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం.. సెలవులు పొడిగించేది లేదని స్పష్టం చేసిన విద్యాశాఖ
★ ఢిల్లీ: నేడు ఈడీ ముందు హాజరుకానున్న రాహుల్ గాంధీ.. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు.. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల అవకతవకలపై నోటీసులు జారీ.. ఈడీ నోటీసులను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

Exit mobile version